సర్దార్‌ 2 లో రజిషా!

Sunday, December 22, 2024

కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ ద్విపాత్రాభినయంలో  నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్ధార్. ఈ సినిమా 2022 లో థియేటర్ల లో విడుదలై ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ సర్దార్ 2 ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. సర్ధార్ లో నటించిన రజిషా విజయన్ సర్దార్ 2 లో కూడా యాక్ట్ చేయబోతుందంట. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా తెలిపారు.

విడుదల చేసిన పోస్టర్ లో హీరోయిన్ లుక్ ఆకట్టుకుంటుంది. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles