తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఇప్పటికే ట్రైలర్, టీజర్ వంటి ప్రమోషనల్ వీడియోలు మంచి రెస్పాన్స్ తెచ్చి, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపాయి.
ఇంతలోనే రజినీ తదుపరి సినిమా గురించి కూడా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన దర్శకుడు-నటుడు శశికుమార్, తన కొత్త ప్రాజెక్ట్ కోసం రజినీని సంప్రదించినట్టు సమాచారం. ఆయన సిద్ధం చేసిన కథలోని కొంత భాగాన్ని రజినీకి వినిపించగా, తలైవా వెంటనే ఓకే చెప్పినట్లు చెబుతున్నారు.
ఇప్పుడు శశికుమార్ ఆ స్క్రిప్ట్‌ను పూర్తిచేసి త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు, రజినీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌గా ‘జైలర్ 2’లో కూడా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని నెల్సన్ డిలిప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
