సూర్య కోసం రజినీ, ప్రభాస్‌!

Friday, January 17, 2025

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా‘కంగువా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి ఫాంటెసీ యాక్షన్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో సూర్య వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తుండటం.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

‘కంగువా’ చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్‌ చేస్తుండడంతో  తెలుగులోనూ భారీగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా తారాస్థాయిలో నిర్వహించాలని చిత్ర యూనిట్‌ భావించిందంట.

‘కంగువా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా చేయాలని.. ఈ ఈవెంట్ కోసం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్‌లను ముఖ్య అతిథులుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట.

ఒకే వేదికపై సూర్య, రజినీకాంత్, ప్రభాస్‌లను చూస్తే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. మరి నిజంగానే ‘కంగువా’ కోసం ఈ స్టార్ హీరోలు వస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చానీయాంశం అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles