రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలి సినిమా శివరాత్రికి వస్తుందోచ్‌!

Monday, December 23, 2024

బేబి డమరి సమర్పిస్తున్న శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని యాక్ట్‌ చేస్తుంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వయంగా డైరెక్షన్‌ చేస్తూ ఓ ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

ఈ నెల 27న “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ విడుదల అవ్వాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమా బిజినెస్ షో వేశారు మేకర్స్.బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాక థియేటర్ విడుదల కూడా ఇప్పుడు హడావుడిగా కాకుండా శివరాత్రి కి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

సినిమా కంటెంట్ కూడా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో మేకర్స్ కూడా వారు చెప్పింది నిజమేనని భావించి సినిమా విడుదల్ని వాయిదా వేశారు.

వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles