అదిరిపోయిన రాజాసాబ్‌ పోస్టర్‌!

Wednesday, December 25, 2024

డైరెక్టర్ మారుతి,  రెబల్ స్టార్ ప్రభాస్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను తీస్తున్నారు. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సినిమా నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్‌ మోషన్‌ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మోషన్‌ పోస్టర్‌లో డార్లింగ్ ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో అదిరిపోతున్నాడు. రాజసం ఉట్టి పడే రాయల్‌ లుక్‌లో ఉన్న రాజాసాబ్‌ స్టిల్ సోషల్ మీడియాలో అప్పుడే ట్రెండింగ్‌ అయిపోతుంది. ప్రభాస్ సరికొత్తగా కనిపించి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపాడు. డార్లింగ్ లుక్‌ చూసి రెబల్ స్టార్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘రాజసం ఆయన బ్లడ్‌లోనే ఉంది. వివాదరహితుడైన పాలనాదక్షుడు 10 ఏప్రిల్ 2025న వస్తున్నాడు. దీనికే ఇలా అయిపోతే ఎలా.. ముందు ఉంది అసలైన పండగ’ అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్ చేశారు.

ఇక నుంచి తరచుగా అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పారు.ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని సమాచారం. కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా ఉన్నట్లు ఓ వార్త అయితే   చక్కర్లు కొడుతోంది. రాజాసాబ్ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశాడట. ఈ మూవీ బ‌డ్జెట్ దాదాపు 200 కోట్లపైనే అని టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో రాజాసాబ్ ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు మొదలు పెట్టింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles