యూరప్‌ వెళ్లిన రాజాసాబ్‌!

Tuesday, December 9, 2025

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ సినిమాను రూపొందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి రోజు నుంచే అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలోకి చేరుకుంది. త్వరలో యూరప్‌లో కొత్త షెడ్యూల్‌ జరగనుంది. హీరో ప్రభాస్, కథానాయికలపై రెండు ప్రత్యేక గీతాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles