మెరీనా బీచ్‌ లో రాజాసాబ్‌ రాగాలు!

Saturday, June 29, 2024

ప్రస్తుతం యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా కల్కి సినిమా ఫీవర్‌ లో ఉంది. మరో పక్క ప్రభాస్‌ మరో సినిమా రాజాసాబ్‌ పనులు కూడా ఎంతో జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాని యంగ్‌ డైరెక్టర్‌ మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం దర్శకుడు చెన్నైలో సంచరిస్తున్నట్లు సమాచారం.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ త‌మ‌న్ తో క‌లిసి ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా గ‌డుపుతున్నారు. మెరీనా బీచ్‌లో మారుతి, త‌మ‌న్ క‌లిసి సినిమాకి సుస్వరాలను అందించే పనిలో బిజీగా ఉన్నారు. ‘రాజాసాబ్’ లో మొత్తం 5 పాట‌లు ఉండనున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే త‌మ‌న్ 3 పాట‌ల‌కు ట్యూన్లు సమకూర్చేశాడు. మ‌రో రెండు పాట‌లు మాత్రమే బాకీ ఉన్నాయి. అవి కూడా రాబ‌ట్టుకొనే ప‌నిలో మారుతి చెన్నై వెళ్లారు.

వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ‘రాజాసాబ్‌’ని తీసుకురావాల‌ని మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అప్ప‌టికి సినిమా సిద్ధ‌మ‌య్యే ఛాన్సులు క‌నిపించ‌డం లేదు. అందుకే 2025 వేస‌వి బ‌రిలో నిలిపేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. ‘క‌ల్కి’ త‌ర‌వాత విడుద‌ల‌య్యే ప్ర‌భాస్ సినిమా ఇదే. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో సాగే సినిమా ‘రాజాసాబ్‌’.

ఇందులో సంజ‌య్‌ద‌త్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ‘క‌ల్కి’ ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా గ‌డిపిన ప్ర‌భాస్ ఇప్పుడు హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్ల‌బోతున్నాడు. అక్క‌డ ఓ నాలుగు వారాలు గ‌డిపి, తిరిగి ఇండియాకు వ‌స్తాడు. తిరిగొచ్చాక ‘రాజాసాబ్‌’ షూటింగ్ మొదలు కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles