యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో దర్శకుడు మారుతీ డైరెక్షన్ లో వస్తున్న “ది రాజా సాబ్” ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి బజ్ నడుస్తూనే ఉంది. మొదట ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత మేకర్స్ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని ఫిక్స్ చేశారు.
అయితే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి వస్తుందని వార్తలు వినిపించాయి. ఆ టాక్ కి ఇప్పుడు అధికారికంగా క్లారిటీ వచ్చింది. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ “ది రాజా సాబ్” 2026 జనవరి 9న థియేటర్లలోకి రాబోతుందని స్పష్టంగా తెలిపారు.
