వచ్చే నెల నుంచి రాజాసాబ్‌ మూవీ!

Saturday, December 21, 2024

ప్రభాస్ తాజాగా హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 1000 కోట్ల కలెక్షన్‌ ను దాటి ముందుకు దూసుకుపోతుంది. కల్కికి తగ్గ సినిమా ఏది థియేటర్లలో పడకపోవడంతో మరికొన్ని రోజులు కల్కి హావా నడిచేట్టు కనిపిస్తుంది.  ఈ సినిమా విజయం కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్  గురించి  డైరెక్టర్ మారుతి వివరించాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ఈ హారర్ కామెడీ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే  కొన్ని షెడ్యూల్స్ సీక్రెట్ గా షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మారుతి మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోందని చెప్పుకొచ్చాడు. ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇక మీదట విడుదల చేయబోతుందని కూడా ఆయన తెలిపాడు. ఇక ఈ సినిమా కథ గురించి కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ కాస్త ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయితే కానీ అవి నిజమా కాదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles