పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చే క్రేజీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’ ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇది హారర్ కామెడీ జానర్‌లో వస్తుండటమే కాదు, దర్శకుడు మారుతి శైలిలో వినోదం కూడా పుష్కలంగా ఉండబోతోందని అందరూ భావిస్తున్నారు.
ఈ సినిమా నుంచి మొదటి అధికారిక అప్‌డేట్ వచ్చిన క్రమంలో, టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూన్ 16న ‘ది రాజాసాబ్’ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ టీజర్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో టీమ్ బిజీగా ఉంది. మారుతి దర్శకత్వంలో థమన్ మ్యూజిక్ మిక్సింగ్ పనుల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో సినిమా నుంచి భారీ ప్రోమోషనల్ డ్రైవ్ మొదలవుతుందని సంకేతాలు కూడా ఇవ్వడం గమనార్హం.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, వినోదం, హర్రర్ కలయికలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు టీజర్ డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో, ‘ది రాజాసాబ్’ సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగిపోయింది.
