డేవిడ్ వార్నర్‌ తో రాజమౌళి…నవ్వులే నవ్వులు!

Tuesday, January 21, 2025

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం క్రికెట్‌ మాత్రమే కాకుండా… తెలుగు ఇండస్ట్రీ హీరోల డ్యాన్స్ లతో అదరగొడుతుంటాడు. రీల్స్, షాట్స్‌తో కరోనా టైంలో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఐపీఎల్‌ లో  సన్ రైజర్స్ టీమ్‌కు ఆడి హైదరాబాదీలకు బ్రదర్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు వార్నర్ ఏకంగా యాక్టర్‌గా మారాడు.

Cred UPI యాడ్‌లో దర్శక ధీరుడు జక్కన్నతో  కలిసి యాక్ట్‌ చేశాడు. ఈ యాడ్‌ ప్రారంభంలో లో ముందుగా జక్కన్న  వార్నర్‌ కి కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు. అది కావాలంటే తనకు సినిమా అవకాశం  ఇవ్వాలని వార్నర్ కోరుతాడు. ముందు  RRR, మగధీర సినిమా గెట్ అప్స్‌లో కనిపించిన ఆయన.. చాలా దారుణంగా నటించి జక్కన్నకే ఇరిటేషన్‌  తెప్పిస్తాడు.

దీంతో చివరగా తాను cred UPI కి అప్ గ్రేడ్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పడంతో యాడ్ అయిపోతుంది. మొత్తానికి నార్మల్ upi యూజ్ చేస్తే డేవిడ్ వార్నర్ యాక్టింగ్‌లా.. cred UPI వినియోగిస్తే అసలు హీరోల్లా ఉంటుందనేది యాడ్ మీనింగ్. కాగా నెటిజన్స్ ఈ యాడ్‌కు ఫిదా అయిపోయారు. రాజమౌళి ప్రాజెక్ట్‌లో వార్నర్‌ను చూడాలని ఉందని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles