సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం జోరుగా షూట్ అవుతుంది. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఆఫ్రికా అడవుల్లో జరగనుంది. మహేష్ బాబును ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా రాజమౌళి ఈ సినిమాలో ప్రదర్శించబోతున్నాడు.
మహేష్ బాబులోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. సినిమాలో ఒక ఫోక్ స్టైల్ పాట ఉంటుందన్నది కూడా స్పెషల్, దీనికి కీరవాణి మ్యూజిక్ అందించనున్నాడు. రాజు సుందర్ ఈ పాట కోసం ప్రత్యేకంగా కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ పాటలో మహేష్ బాబు మరియు హీరోయిన్ ప్రియాంక చోప్రా సరికొత్త స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టబోతోన్నారు.
మహేష్-ప్రియాంక డ్యాన్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
