రాజమౌళి, మహేష్‌ సినిమాలో ఆలనాటి హీరోయిన్‌!

Sunday, December 22, 2024

ఈ మధ్య చాలామంది డైరెక్టర్లు ఆలనాటి హీరోయిన్లను తమ సినిమాల్లో తీసుకుని వారిని మరోసారి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాజమౌళి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి మహేష్‌ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి సినిమాలోకి ఆలనాటి అందాల నటి సిమ్రాన్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తు ఉన్న ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయ్యింది.  కొంత కాలం క్రితం కొన్ని తమిళ సినిమాల్లో సహాయ నటిగా చేసింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా తాను హీరోయిన్ గా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే సిమ్రాన్ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్న పాన్  ఇండియా మూవీలో సిమ్రాన్ నటించబోతున్నట్టు సమాచారం.టాలీవుడ్ దర్శకధీరుడు… తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన డైరెక్టర్  రాజమౌళి. ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని చాలామంది ఎదరు చూస్తుంటారు. కాని అది అందరికి సాధ్యం కాదు. అటువంటిది.. రాజమౌళి సినిమా కోసం ఆటీమ్ నుంచే పిలుపు వస్తే.. అది చాలా పెద్ద గౌరవంగా చెప్పుకొవచ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దాదాపు ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అమెజాన్ అడ్వెంచర్ జానర్ లో ఈమూవీ రూపొందుతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటికే పలు రకాల ఆసక్తికరమైన కామెంట్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేసిన  సిమ్రాన్ ను ఇప్పుడు ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారు..? ఆమెకు ఎలాంటి పాత్ర ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తల్లికొడుకులుగా చేస్తారా ఏంటి అనే ప్రశ్నలు వినపడతున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది అంతే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles