VD14 కథ వేరుగా ఉంటుందంటున్న రాహుల్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను కొంతవరకు మాత్రమే అలరించింది. ఈ సినిమా ఫలితం తర్వాత విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సినిమా టీమ్ సమాచారం ప్రకారం, ఈసారి విజయ్ దేవరకొండ పూర్తిగా భిన్నమైన లుక్‌లో, మరింత ఉగ్రంగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం పీరియాడిక్ నేపథ్యంతో సాగే ఈ డ్రామాలో కథ, విజువల్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతి పంచుతాయని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles