ఎస్‌జే సూర్యతో చేతులు కలిపిన రెహమాన్!

Friday, December 5, 2025

తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఎస్.జె. సూర్య చాలా రోజుల తర్వాత దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈసారి ఆయన తానే హీరోగా కూడా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘కిల్లర్’. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించగా,  మంచి బజ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే గత కొంత కాలంగా నటన మీదే ఫోకస్ పెట్టిన ఎస్.జె. సూర్య ఇప్పుడు మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. సంగీత రంగంలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. ఆయనకి ఇది కొత్త విషయం కాదు కానీ, ఈసారి రెహమాన్ చాలా ఏళ్ల తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వంలో సంగీతం అందించబోతుండటం విశేషం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ‘కిల్లర్’ మూవీ కోసం రెహమాన్ ఎలా మ్యూజిక్ కంపోజ్ చేస్తాడో అని సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ చిత్రాన్ని గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రెహమాన్ ట్యూన్స్, సూర్య మేకింగ్‌ కలిసితే ఈ సినిమా ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి. ఎస్.జె. సూర్య అభిమానులు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఆశించే ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles