కింగ్డమ్‌ నుంచి రగిలే..రగిలే..వచ్చేసింది!

Monday, December 8, 2025

టాలీవుడ్‌లో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “కింగ్డమ్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి “రగిలే రగిలే” అనే పాట విడుదలైంది. యూత్‌ఫుల్ ఎనర్జీతో నిండిన ఈ సాంగ్‌ను అనిరుద్ సంగీతంలో రూపొందించారు. పవర్‌ఫుల్ బీట్స్‌తో, చల్లగానే ప్రారంభమై ఊపందుకునే ట్యూన్‌తో ఈ పాట ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలి కాలంలో “వైబ్ ఉంది” లాంటి పాటతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. పదాల్లో కనిపించే ధైర్యం, ఫైర్, రెబెల్ టోన్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది.

ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇవ్వబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అనిరుద్ మార్క్ మ్యూజిక్ ఈ సినిమా మ్యూజికల్ హైల్‌యిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. “కింగ్డమ్”లో విజయ్ గెటప్‌, మేకింగ్ స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అన్నీ కలిసిపోయి సినిమా హైప్‌ను మరింత పెంచుతున్నాయి.

ఈ సాంగ్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ ఇంకొంత స్పీడ్ పుంచుకున్నాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి పాటలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles