పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా చిత్రంలో భాగమవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇప్పుడు ఈ లైన్‌లో నడుస్తున్న ఓ టాక్ ప్రకారం, రాశి ఖన్నా కూడా ఈ ప్రాజెక్ట్‌కు జాయిన్ అయ్యే అవకాశం ఉందట. గతంలో పవన్ కళ్యాణ్‌తో రాశి ఖన్నా కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు పలు మార్లు వచ్చినా, అవి సెట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం కలయిక ఫైనల్ అయ్యేలా కనిపిస్తోందని ఫిలింనగర్ టాక్.
పవన్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం కొత్త విషయం కాదు. ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాల్లోనూ అలాంటి సెట్‌అప్ కనిపించింది. అందుకే రాశి ఖన్నా అఫీషియల్‌గా ఫిక్స్ అయితే ఇది పెద్ద సర్ప్రైజ్ కాకపోయినా, అభిమానులకు మాత్రం కిక్ ఇచ్చే విషయమే. ఇక ఈ సినిమాలో పవన్, రాశి మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరొవైపు, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ ఈసారి మాస్ పాటలతో ఊపేసేలా సిద్ధమవుతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక రాశి ఖన్నా ఎంట్రీ అధికారికంగా ప్రకటిస్తే, ఈ సినిమా మరో లెవెల్‌కు చేరినట్లే.
