పుష్ప-3 ఆర్జీవీ నేనట : పొగడ్తల ట్రాప్ లోకి వర్మ!

Tuesday, January 21, 2025

సాధారణంగా రాంగోపాల్ వర్మ చాలా ప్రాక్టికల్ గా ఉండే మనిషి. ఆయన మాటలు కూడా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. దేనినీ, ఎవ్వరీన లెక్క చేయరు. టీవీ, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలుఇస్తున్నప్పుడు.. తన ఒరిజినల్ అభిప్రాయాలనే ప్రతిసారీ చెప్పాలని, నిజం మాత్రమే మాట్లాడాలనే కట్టుబాటు ఆయనకు ఏమాత్రం ఉండదు. ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడానికి ఏం మాట్లాడితే బాగుంటుందో.. అవతలి వాళ్లు తాను ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారో అది మాత్రమే ఆయన మాట్లాడుతుంటారు.అందుకే ఆయన ఏం మాట్లాడినా సరే.. అది నిజంగా ఆయన అభిప్రాయమేనా? లేదా, ఏదో ఎవరి ముఖప్రీతికోసమో మాట్లాడారా? అనేది తేల్చుకోవడం కష్టం. అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు పొగడ్తలకు పడిపోయి మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు ద్వారా తెలంగాణ పోలీసులు చాలా పెద్ద తప్పు చేశారని అందరూ పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే బెదిరింపు రావడం లేదు గానీ.. వారి తప్పును మాత్రం ఖండిస్తున్నారు. ఇదే పని రాంగోపాల్ వర్మ కూడా తనదైన స్టయిలులో చేశారు.

అరెస్టు తర్వాత.. ఆయన ఒక ట్వీట్ పెట్టారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు వంటి సందర్భాల్లో ఎవరైనా చనిపోతే దేవుళ్ల మీద కేసు పెడతారా? పొలిటికల్ మీటింగుల్లో చనిపోతే నాయకుల మీద కేసు పెడతారా? సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లలో చనిపోతే హీరో హీరోయిన్ల మీద కేసు పెడతారా? ఇలా నాలుగు ప్రశ్నలు ఆయన సంధించారు. నిజానిక తలాతోకాలేని వాదనలు ఇవి. ఇలాంటి సందర్భాల్లో కూడా కేసులు పెడతారు. కానీ.. దేవుళ్ల మీద కాదు.. ఆ కార్యక్రమ నిర్వాహకుల మీద పెడతారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో జరిగినట్టుగా.. పోలీసు భద్రత తీసుకోకుండా, పోలీసులు వద్దన్నా సరే.. కార్యక్రమాన్ని నిర్వహించి.. తొక్కిసలాట లేదా మరణాలకు కారణంగా మారితే ఇంకా తప్పకుండా అరెస్టు చేస్తారు.

అయితే తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరున అల్లు అర్జున్ ఎంజాయి చేసిఉంటారని అభివర్ణిస్తున్న వర్మను .. ఒక టీవీ ఛానెల్ యాంకర్ హీరోగా పొగిడేశారు. దేవుళ్లను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించడం ద్వారా తెలుగురాష్ట్రాలు వర్మను పుష్ప-3 లాగా, హీరోయిక్ ఇమేజితో చూస్తున్నారని యాంకర్ పొగడ్డం, ఆ పొగడ్తలను వర్మ మురిసిపోతూ స్వీకరించడం చాలా చిత్రంగా కనిపించింది. చూడబోతే.. సాధారణంగా చాలా ప్రాక్టికల్ గా ఉండే వర్మ ఇప్పుడు పొగడ్తలను కోరుకుంటున్నట్టుగా, పొగడ్తలకు పడిపోతున్నట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles