నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఆమె నటించిన కొత్త చిత్రం ‘థామా’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆమె సరసన నటించాడు.
‘థామా’ తరువాత రష్మిక మరో సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో ప్రేక్షకులను కలవడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత రష్మిక తన తదుపరి చిత్రంగా ‘మైసా’ అనే సినిమాను ప్రకటించింది. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో నటుడు తారక్ పొన్నప్ప కూడా భాగమవుతున్నారని తెలిసింది. ఆయన గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘పుష్ప-2’లో తన ప్రతినాయక పాత్రతో మంచి ఇంపాక్ట్ సృష్టించాడు. ఇప్పుడు రష్మికతో కలిసి ‘మైసా’లో కనిపించబోతుండటంతో, ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి పెరుగుతోంది.
