జాతీయనటుడు అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో వచ్చింది పుష్ప సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
‘పుష్ప 2’ కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం పుష్ప-2 గ్లింప్స్ ను విడుదల చేసిన సినిమా మీద మరింత హైప్ ను క్రియేట్ చేశారు. పార్ట్ వన్ కన్నా పార్ట 2 వేరే లెవల్ ఉంటుందని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు, నటులు కూడా చెబుతూ అప్పుడప్పుడు మీడియాతో చెబుతూనే ఉన్నారు.
ఆగస్టు 15 న పుష్ప 2 ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మధ్య సినిమా వాయిదా పడనుందని ఎన్నో రకాల మాటలు వినిపించాయి. కానీ వాటిని కొట్టి పారేస్తూ మేకర్స్ చెప్పిన టైంకి సినిమాను విడుదల చేస్తున్నట్లు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదని ఓ షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ అమిత్ కరణ్ తాజాగా తమ ట్విట్టర్ లో..” ‘పుష్ప 2’ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని, ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదని, అందుకు కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న కారణంగా విడుదల తేదిని వెనక్కి నెట్టినట్లు” రాసుకొచ్చాడు.
దీంతో ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మూవీమేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.