రేపటి నుంచి పుష్ప 2 సినిమా షూటింగ్‌!

Wednesday, January 22, 2025

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో, స్టార్‌ డైరెక్టర్‌ , లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కాంబోలో ఎంతో భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

రేపటి నుండి బన్నీ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. తన పార్ట్ కి సంబంధించిన  షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్  కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై  ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో విడుదల కానున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles