మెగా స్టార్‌ ని కలిసిన పుష్ప 2 మేకర్స్‌!

Wednesday, December 18, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ ప్రెస్టీజియస్ సీక్వె్‌ సినిమా పుష్ప 2. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా చూపిస్తుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన యాక్టింగ్‌తో వేరే లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్షకులకు ఇచ్చినట్లు  అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతున్నారు.

‘పుష్ప-2’ మూవీకి అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్‌  సుకుమార్, మైత్రీ నిర్మాతలు రవి, నవీన్, సీఈవో చెర్రీ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్న ‘పుష్ప-2’ బృందానికి చిరంజీవి తన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకు తీసుకుళ్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుకుమార్ తన తరువాత చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను త్వరలోనే ప్రారంభించనున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles