పుష్ప 2 ఐటమ్‌ సాంగ్‌ కి దేవర కాంట్రాక్ట్‌!

Monday, December 23, 2024

ఆలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్‌ మాత్రం రాలేదు. దీంతో ఆమె టాలీవుడ్‌ పై మొగ్గు చూపింది. దేవర సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అప్పటి నుంచి తెలుగులో వరుస సినిమాలు ఆమె వద్దకు క్యూ కట్టాయి.

 తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తోంది. కమర్షియల్‌గా స్టార్ హీరోలకి తగ్గట్టుగా గ్లామర్‌ పరంగా కూడా జాన్వీ సరిగ్గా బ్యాలెన్స్ చేయగలదని దేవర మూవీ నుంచి ఇటీవల విడుదలైన “చుట్టమల్లె” సాంగ్‌ రుజువు చేసింది. అయితే ముందు నుంచి జాన్వీ కపూర్ చేత పుష్ప 2లో ఐటెమ్ నంబర్‌ చేయించాలని సుకుమార్ – అల్లు అర్జున్ అనుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే ఆమె దేవర ప్రొడక్షన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ లెక్క ప్రకారం దేవర సినిమా విడుదలయ్యే వరకు ఆమె ఏ తెలుగు సినిమా లో కూడా  నటించకూడదు. రామ్ చరణ్ సినిమా కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆమెకు ఇబ్బంది లేదు.అయితే అల్లు అర్జున్ పుష్ప 2ని మొదట ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పుడు, ఈ ఒప్పంద నిబంధన ప్రకారం ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి అనుమతి లేదు. అయితే, ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్‌కు వెళ్ళింది.

దేవర సెప్టెంబర్‌లో విడుదల అవుతుంది కాబట్టి ఆమె పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ చేసినా పెద్దగా ప్రాబ్లెమ్‌ ఉండదు. సుకుమార్,  అల్లు అర్జున్ యానిమల్  నటి తృప్తి డిమ్రీని ఐటెం సాంగ్ కోసం అనుకున్నా ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి తగినంత బలమైన డ్యాన్సర్ కాదని వారు వెనక్కు తగ్గారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగంలో “ఊ అంటావా ఊ ఊ అంటావా” ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అంతకు మించి అనిపించేలా ఈ సారి ప్లాన్ చేస్తూ మంచి డ్యాన్సర్ కోసం మూవీ టీమ్‌ వెదుకలాట ప్రారంభించింది..

దానికి జాన్వీ కపూర్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప 2లో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె “ఊ అంటావా ఊ ఊ అంటావా” లాంటి పెర్ఫార్మెన్స్ అందిస్తే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ఇక ఆమె తెలుగు స్టార్ హీరోలందరికీ ఆమె అత్యంత డిమాండ్ ఉన్న నటి అవుతుందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles