పుష్ప 2’ క్లైమాక్స్ ఓ యాక్షన్ ధమాకా!

Saturday, January 18, 2025

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే,  విడుదలైన  ఈ ట్రైలర్ అద్భుతంగా అలరిస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు బయటకు వచ్చిన ‘పుష్ప 2’ ప్రమోషనల్ కంటెంట్ అయితే అద్భుతంగా ఆకట్టుకుంది.

అయితే, ‘పుష్ప 2’ క్లైమాక్స్ పై ఓ క్రేజీ న్యూస్ అయితే బయటకు వచ్చింది. క్లైమాక్స్ ఉహించని విధంగా ఉంటుందని.. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ ఓ ఫీస్ట్ అని..ముఖ్యంగా పుష్ప రాజ్ ఊచకోతకు వెన్నులో వణుకు పుడుతుందని సమాచారం.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై ఎర్నేని నవీన్ , వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం సమకూరుస్తున్నారు.

మొత్తానికి పుష్ప-2 చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు అభిమానులు  అప్పుడే రెడీ గా ఉన్నారు. మరి ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles