‘ఛత్రపతి’ కోసం పుష్ప 2, బ్రహ్మాస్త్ర టెక్నీషియన్స్!

Thursday, March 27, 2025

ప్రస్తుతం హిందీ సినిమా దగ్గర అదరగొడుతున్న భారీ చిత్రం “ఛావా”. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుంది. అయితే శంభాజీ మహారాజ్ జీవిత్ర చరిత్రపై తెరకెక్కించిన ఈ సినిమా చూసి ఎగ్జైట్ అవుతున్న ఆడియెన్స్ తన తండ్రి ఛత్రపతి మహారాజ్ జీవిత చరిత్రపై సినిమా వస్తే ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు సందీప్ సింగ్, కన్నడ హీరో రిషబ్ శెట్టితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై మేకర్స్ లేటెస్ట్ గా కీలక టీమ్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి పుష్ప 2 సహా ఎన్నో సాలిడ్ సినిమాలకి సౌండ్ డిజైన్ చేసిన టెక్నీషియన్ రేసుల్ పూకుట్టి సహా మరింత మంది కీలక టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

మరి వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ కూడా ఉన్నారు. బ్రహ్మాస్త్ర, ధూమ్, డంకి, కలాంక్ లాంటి పలు సినిమాలకి వర్క్ అందించిన తాను ఈ బిగ్ ప్రాజెక్ట్ కి వర్క్ చేయనున్నారు. ఇక వీరితో పాటుగా మరింతమంది కీలక వ్యక్తులు ఈ సినిమా కోసం వర్క్ చేయనున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమాని మేకర్స్ 2027 జనవరి 21న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి లాక్ చేసారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles