పేరు మార్చుకున్న పూరి తనయుడు!

Monday, December 8, 2025

టాలీవుడ్ సక్సెస్‌ ఫుల్‌  డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ త‌న వారసుడు ఆకాష్ పూరినిచిన్న తనంలోనే  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ప‌లు సినిమాల్లో న‌టించిన ఆకాష్ పూరి హీరో కూడా అయ్యాడు. ఆకాష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులే వచ్చాయి.

అయితే, తాజాగా త‌న పేరును ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జ‌గ‌న్నాధ్ గా మార్చుకుంటున్న‌ట్లు ఈ యంగ్ హీరో ఓ ప్రకటనలో ప్ర‌క‌టించాడు. ఈ రోజు ఆకాష్‌ పూరి పుట్టిన రోజు సందర్భంగా తాను పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకు ముందు కూడా  తండ్రి పేరు క‌లిసేలా ఆకాష్ పూరి ఉండ‌గా, ఇప్పుడు కొత్త పేరులోనూ తండ్రి పేరు జ‌గ‌న్నాథ్‌ అనే పేరును కంటిన్యూ చేస్తున్నాడు.

ఇక ఈ హీరో సినిమాల పరంగా చివరిగా న‌టించిన ‘చోర్ బ‌జార్’ మూవీలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌లేదు. త‌న నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ప‌లు క‌థ‌లు వింటున్నట్లు టాక్‌.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles