‘తండేల్’లో ప్యూర్ మెలోడీ ‘బుజ్జి తల్లి’ పాట!

Monday, December 23, 2024

అక్కినేని యువ సామ్రాట్‌ నాగచైతన్య నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘తండేల్’ గురించి అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని యంగ్‌ డైరెక్టర్‌ చందు మొండేటి తెరకెక్కిస్తుండగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా ‘బుజ్జి తల్లి’ అనే సాంగ్‌ను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే, వారి ఎదురుచూపులకు పూర్తి న్యాయం చేసేలా ‘బుజ్జి తల్లి’ సాంగ్ ప్యూర్ మెలోడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది

దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ ట్యూన్స్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఇక సింగర్ జావేద్ అలీ ఈ పాటను తన వాయిస్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో బన్నీ వాస్ నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles