దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా షూట్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లి కోసం షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ, తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది.
ఈ రోజు మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి కెన్యాలో స్టార్ట్ కాబోతుంది. ఆ దేశంలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.