దసరా ముగిసింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద పండుగ సందడి ముగిసింది. పండుగ నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం కొంచెం ఫర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు దీపావళి కి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. పండుగతో పాటు పబ్లిక్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు విడుదల చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు.
దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో సందడికి రెడీ అవుతున్నాయి. ఆక్టోబరు 30న దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ తో విడుదలకు సిద్దంగా ఉంది. ఇక అక్టోబరు 31న నిఖిల్ ‘అప్పుడో ఇపుడో ఎపుడో’ రానుంది. అదే డేట్ లో సత్యదేవ్ జీబ్రా కూడా వస్తుంది. మరొక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ‘క’ అక్టోబరు 31న వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
వీటితో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్ ‘అమరన్’ కూడా అదే రోజు రాబోతుంది. అమరన్ కు పోటీగా జయం రవి ‘బ్రదర్’ బరిలో నిలిచింది. ఇవి చాలవన్నట్టు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ‘బఘీర’ అక్టోబరు 31న విడుదల చేస్తున్నట్టు తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు . ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ విడుదల చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఏ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రావని, కొన్ని ఏరియాల్లో థియేటర్స్ కూడా దొరకడం ఇబ్బందే అని తెలుస్తున్నాయి. అయినా సరే సదరు నిర్మాతలకు ఫెస్టివల్ రోజే కావాలని కాచుకుకూర్చున్నారు.