సైలెంట్‌ గా షూటింగ్‌ మొదలెట్టిసిన ప్రశాంత్‌ వర్మ

Tuesday, January 21, 2025

యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు. కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ను కూడా ముందుగానే ప్రకటించాడు.

రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్‌కి పూజ కూడా నిర్వహించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే  కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌సింగ్‌ని ప్రశాంత్ వర్మ కలిశారు. దీంతో  వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుందునే జోరుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సినిమా మొదలైందని ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ కూడా జరుగుతుందని సమాచారం. అయితే ఈ షూటింగ్ కి సంబంధించి  ఇంట్రెస్టింగ్  గ్లింప్స్‌ని త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles