తారక్‌ లేకుండా ప్రశాంత్‌ నీల్‌ సినిమా!

Tuesday, January 14, 2025

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా #NTR31 సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లబోతుందంట. అంతేకాదు మొదటి షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ లాంటి సినిమాలు భారీ విజయాలు సాధించిన అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఏ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles