పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్పిరిట్’ కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఓ శక్తివంతమైన పోలీస్ కథగా ఉంటుంది. ప్రభాస్ తన పాత్రకి తగ్గట్లుగా శారీరక కసరత్తులు చేస్తూ, ప్రత్యేకమైన డైట్ ను పాటిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాలో అతని కొత్త హెయిర్ స్టైల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని సమాచారం. త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుంది.
మ్యూజిక్ విషయంలో హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రధానంగా పని చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో కలసి మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తిచేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రభాస్ సినిమాలకు ముందుగానే గుర్తింపుగా మారిన ‘విజిల్ సౌండ్ సెంటిమెంట్’ను ఈ చిత్రంలో కొనసాగిస్తారని తెలిపారు.
‘స్పిరిట్’ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రధాన కథానిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని సమాచారం.
