స్పిరిట్‌ స్టార్టింగ్‌ ఆరోజేనా!

Saturday, April 12, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్.

ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఎప్పుడెప్పుడు ఇది పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్పిరిట్ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ స్టార్ట్ అయ్యిందని.

ఈ సినిమాను ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారట. దీంతో అభిమానులు ‘స్పిరిట్’ మూవీ పూజా కార్యక్రమం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ వెల్లడించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles