ఆ మల్టీ స్టారర్ కి నో చెప్పిన ప్రభాస్‌!

Tuesday, January 21, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. మరో డైరెక్టర్ హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైంది. అయితే ప్రభాస్ రీసెంట్‌గా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి నో చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెయిన్ హీరోగా, సెకండ్ లీడ్ హీరోగా ప్రభాస్ నటిస్తాడని దర్శకుడు చెప్పడంతో.. ప్రభాస్ ఈ సినిమాకు నో చెప్పాడట.

తాను ఇప్పట్లో మరో మల్టీస్టారర్ చిత్రానికి రెడీగా లేనని ప్రభాస్ తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ తప్పినట్లు బీ-టౌన్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే ప్రభాస్ మల్టీస్టారర్ మూవీకి నో చెప్పాడా.. అనేది తెలియాలి..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles