ప్రభాస్-ప్రశాంత్ ఓ క్రేజీ న్యూస్! ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా పలు భారీ సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నటిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా నటించనున్న సినిమాలు కూడా కొన్ని ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మకి కూడా ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి.
అయితే ప్రభాస్ తన సలార్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ తో లాక్ చేసిన మొత్తం మూడు సినిమాల్లో ఒకటి ఈ యువ దర్శకునితోనే అని టాక్ కూడా ఉంది. అయితే ప్రశాంత్ వర్మతో సినిమాపై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది. దీనితో ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా లుక్ టెస్ట్ లో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ వారంలోనే వీరి కాంబినేషన్ పై లుక్ టెస్ట్ పూర్తి కానుంది అని ఆల్రెడీ ప్రశాంత్ వర్మ డార్లింగ్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ లుక్ ని డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ సాలిడ్ కాంబినేషన్ పై ఒక అధికారిక క్లారిటీ కోసం ఇపుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.