కర్ణుడిగా ప్రభాస్ లుక్‌ అదిరింది!

Monday, September 16, 2024

మన టాలీవుడ్ లో ప్రస్తుతం పీరియాడిక్ పాత్రలకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా తాజాగా పలు ఐకానిక్ పాత్రలు చేయగా తాజాగా ఆయన ఖాతాలోకి వచ్చిన చేరిన మరో పాత్ర  “కర్ణ”. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఏడీ” లో ప్రభాస్ ని ఊహించని విధంగా కర్ణుడి పాత్రలో మేకర్స్ ప్రెజెంట్ చేయడంతో థియేటర్స్ దద్దరిల్లాయి.

అయితే సినిమాలో ప్రభాస్ ఫుల్ లుక్ ని అయితే  మూవీ మేకర్స్‌ అంతగా చూపించలేదు. కేవలం కొన్ని షాట్స్ మాత్రమే సినిమాలో మూవీ మేకర్స్‌ చూపించగా ఇప్పుడు ప్రభాస్ కర్ణుడు ఫుల్ లుక్ అయితే వైరల్ గా మారింది. ఆఫ్ లైన్ లో ఆల్రెడీ ప్రభాస్ కర్ణుడి లుక్ బయటకి రాగా ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కర్ణుడిగా ప్రభాస్ ని అయితే అదిరిపోయే లెవెల్లో మేకర్స్ డిజైన్ చేశారు అని చెప్పుకోవచ్చు. తన విల్లు, తన కవచం, వేషధారణలో ప్రభాస్ ఎంతో తేజంతో కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles