ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘సీతా రామం’తో ప్రేక్షకులని ఆకట్టుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ డిసెంబర్ 2026 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ సమయంలో హను రాఘవపూడి చిన్న విషయాలపై కొంచెం ఎక్కువ ఆగ్రహం చూపించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై ప్రభాస్ అతనిని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని, తన ప్యాషన్, డెడికేషన్‌ని సినిమాకు సరైన దిశలో చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.
