ప్రభాస్‌ రాజువయ్యా..మహారాజువయ్యా..!

Sunday, December 22, 2024

కేరళలో జరిగిన విధ్వంసానికి అక్కడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో యావత్‌ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయనాడ్‌ లో జరిగిన విధ్వంసానికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోడవమే కాకుండా..వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. దీంతో అక్కడ జరిగిన నష్టాన్ని కొంతలో కొంత అయినా భర్తీ చేయాలని సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొంత విరాళాలను కేరళ ప్రభుత్వానికి అందిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటివరకు సౌత్ లోనే అత్యధికంగా రెండు కోట్లు ప్రకటించాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే ప్రభాస్ ప్రతి సంవత్సరం మాదాపూర్ లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుతున్న వంద మంది ప్రతిభవంతులైన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఫీజు చెల్లిస్తాడని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రభాస్ సన్నిహితులు కూడా బయట పెట్టలేదు కానీ అనుకోకుండా ఈ విషయం బయటకు వచ్చింది. ఇంత సహాయం చేస్తూ కూడా దాన్ని పబ్లిసిటీ  చేసుకోకుండా ఉండే ప్రభాస్ గొప్ప హృదయాన్ని అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రాజువయ్య మహారాజువయ్య అంటూ ప్రభాస్ ని కీర్తిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles