గూగుల్‌ లో ప్రభాస్‌ దే హవా!

Andhrawatch
1 Min Read

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశం మొత్తం ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో అందరికీ తెలిసిన విషయమే.  ఆయన ఓ సినిమా చేశాడంటే, అది కచ్చితంగా పాన్ ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ. ఇక ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆయన నటించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఎడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇక 2024లో ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్ సెర్స్’లో రెబల్ స్టార్ హవా కొనసాగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. 2024లో ప్రభాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది సలార్, కల్కి చిత్రాలు గురించే అని  గూగుల్ తెలిపింది.

ఈ విషయం తెలియడంతో రెబల్ స్టార్ మేనియాకు గూగుల్ దద్దరిల్లిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Share This Article