పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ది రాజా సాబ్పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా, హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని టీమ్ చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండటంతో, త్వరలోనే పూర్తి కానుంది.
ప్రభాస్ అభిమానులకు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో కామెడీ, యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రభాస్ నుండి మాస్ ఆడియన్స్ కోసం ఎనర్జీతో నిండిన డ్యాన్స్ కూడా ఉండబోతుందని సమాచారం. ఒక ప్రత్యేక పెప్పీ సాంగ్‌లో ఆయనను ఇంతకుముందు చూడని స్టెప్పులతో చూడబోతున్నామని చిత్ర బృందం చెబుతోంది.
లుక్ విషయంలో కూడా ప్రభాస్ ఈసారి స్టైలిష్‌గా, కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
