పవన్‌ పై ప్రముఖ ఎడిటర్‌ సంచలన కామెంట్స్‌!

Sunday, December 22, 2024

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎడిటర్ గా ‘మార్తాండ్ కె. వెంకటేష్’కి చాలా మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ తో మీరు చాలా దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. ఆయనను చూస్తుంటే మీకేం అనిపిస్తుంది ? అని యాంకర్‌ అడగగా….దానికి ఆయన సమాధానంగా ‘ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్. నిజానికి ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ముందు ఎలా ఉండేవారో , ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.

పవన్ గారు ఎప్పుడూ ఓపెన్ గా ఉంటారు. ఆయనది చాలా మంచి మనసు. నేను కొంచెం డల్ గా ఉంటే.. ఏంటి వెంకటేష్ ఏమైనా సమస్యా ? ఏమైనా డబ్బు సాయం కావాలా ? అని అడిగిన వ్యక్తి ఆయన ఒక్కరే. నన్ను ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరు అలా అడగలేదు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles