సూర్యతో జత కట్టనున్న పూజా!

Wednesday, January 22, 2025

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న లేటెస్ట్ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా చేస్తుంది.అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే సూర్య నటిస్తున్న మరో మూవీ ” సూర్య 44 “..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ జిగర్ తండా డబల్ ఎక్స్ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు.

ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తుండగా…తాజాగా ఈ సినిమా కు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ని చిత్ర బృందం బయటకు తెలిపింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. తాజాగా పూజ హెగ్డేకు వెల్కమ్ చెబుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles