పొలిమేర 3 విడుదల ఆ రేసులో!

Tuesday, April 1, 2025

తెలుగు సినిమా నుంచి వచ్చిన క్రేజీ థ్రిల్లర్ చిత్రాల్లో ఓటిటిలో సెన్సేషన్ సెట్ చేసిన చిన్న సినిమా “మా ఊరి పొలిమేర” కూడా ఒకటి. కొన్నేళ్ల కితం డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా చూసి అందులో ట్విస్ట్ లకి ఆడియెన్స్ షాకయ్యారు. దీనితో దాని సీక్వెల్ కి సాలిడ్ హైప్ నెలకొనగా మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేసిన ఈ చిత్రం థియేటర్స్ లో సాలిడ్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.

ఇక ఈ చిత్రంతో నటుడు సత్యం రాజేష్ వెండితెరపై సోలోగా సాలిడ్ హిట్ కొట్టగా ఇపుడు మేకర్స్ మూడో సినిమాని మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు డాక్టర్ అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ పై ఇపుడు లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలుపుతున్నట్టుగా దర్శకుడు కన్ఫర్మ్ చేశారు.

ఆల్రెడీ 2026 సంక్రాంతి ప్యాకెడ్ గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా దళపతి విజయ్ సహా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల సినిమాలు ఈ రేస్ లో ఉన్నాయి. మరి ఇలాంటి బిగ్ రేస్ లో ప్లాన్ చేస్తున్నట్టు ఇపుడు టాక్. మరి కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాలు అయినా సంక్రాంతి బరిలో ఎన్నో వండర్స్ చేసేలా ఆడియెన్స్ ఆదరించారు. ఇక ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles