దయచేసి నన్ను చంపొద్దు..ప్రభాస్‌ అభిమానులకు అమితాబ్‌ క్షమాపణలు!

Wednesday, January 22, 2025

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు ఎంతో సమయం లేదు. కేవలం గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్‌ లో చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 ఏడీ చిత్ర బృందం ఓ కొత్త వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్, దీపికా, నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్నాదత్‌, ప్రభాస్‌ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ ప్రభాస్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను కలిసిన సమయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. దీని గురించి అమితాబ్‌ మాట్లాడుతూ… ” నాగీ నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్‌ ది ఎలా ఉంటుందో ఓ ఫొటో కూడా తీసుకుని వచ్చాడు. ప్రభాస్‌ ని డంప్‌ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్‌ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. నేను సినిమాలో ఏమి చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయోద్దు” అంటూ అమితాబ్‌ చెప్పుకొచ్చారు.

దానికి ప్రభాస్‌ అడ్డంపడుతూ..తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles