పెద్ది-శివరాజ్‌ కుమార్‌-మాస్‌ పోస్టర్‌…అదుర్స్‌ అంతే..!

Tuesday, December 9, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ “పెద్ది” పై ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్చరణ్ – జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో, మాస్ అటిట్యూడ్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఎలాగైనా హై వోల్టేజ్ ఎంటర్టైనర్‌గా నిలవబోతోందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాంకేతిక బృందం నుంచి నటీనటుల ఎంపిక వరకూ ప్రతిదీ భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్న శివ రాజ్ కుమార్‌ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఆయన ప్రెజెన్స్ సినిమాకే ఓ బలంగా మారనుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో శివ రాజ్ కుమార్ అల్లిన కొత్త లుక్ అట్రాక్షన్ గా మారింది. గౌర్ నాయుడు అనే రోల్లో కనిపించనున్న ఆయన క్యారెక్టర్ గురించి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ పాత్ర కథలో ఎంత వెయిట్‌ను తీసుకువస్తుందో ఇప్పుడు అందరికీ కుర్రియాసిటీగా మారింది.

మొత్తానికి, “పెద్ది” చిత్రం ఒక్క రామ్ చరణ్ స్టార్డమ్‌కే కాదు, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ ఇన్వాల్వ్మెంట్‌తో కూడా మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమా విడుదల సమయానికి ఈ క్రేజ్ ఇంకొంత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles