రీసెంట్ గా మెగా కుటుంబం ఇంట చిన్న పాటి ప్రమాదం జరిగింది. పవర్ స్టార్ పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను చదువుకుంటున్న సింగపూర్ స్కూల్ లో అగ్ని ప్రమాదానికి గురి కావడంతో వారి ఇంట సహా అభిమానుల్లో కూడా కలవరం నెలకొంది.
దీనితో చాలా మంది నటీనటులతో పాటు ప్రధాని మోడీ కూడా మార్క్ పట్ల తమ సానుభూతి వ్యక్త పరిచారు. ఇలా తాజా గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా స్పందించడం అభిమానుల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా దీనికి పవన్ నుంచి రిప్లై వచ్చింది. తారక్ నుంచి వచ్చిన మాటలకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ ఈ సమయంలో తనకోసం నిలబడినందుకు సంతోషం తెలిపారు.
అంతే కాకుండా తన లిటిల్ వన్ కోలుకుంటున్నాడు అంటూ తారక్ చెప్పిన రీతిలోనే సమాధానం ఇచ్చి అభిమానులకి కొద్దిపాటి ఉపశమనాన్ని అందించారు. దీంతో తారక్ కి ఇచ్చిన సమాధానం ఇపుడు వైరల్ అవుతుంది.
https://x.com/tarak9999/status/1909847431212417382
