టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తతుం ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ నిజ జీవితంలో ఎంతోమంది సినీ సహా బయట ప్రజలకి కూడా ఆయన ఎన్నోసార్లు ఆర్ధిక సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా టాలీవుడ్ విలన్ అలాగే కామెడీ పాత్రల్లో కూడా అలరించిన ఫిష్ వెంకట్ కి అందించిన ఆర్థికసాయం గురించి తాజాగా బయటకి వచ్చింది.
గత కొన్నాళ్ల నుంచి ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు.కాగా ఆయన పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే మొత్తం కళ్యాణ్ గారు చూసుకుంటా అని భరోసా ఇచ్చారు. ఆయన వెంటనే ఆర్ధిక సాయంగా 2 లక్షల రూపాయలు జమ చేశారు అని తనకు ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇపుడు అభిమానుల్లో వైరల్ అవుతుంది.