పవన పుత్ర హనుమా భక్త..ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

Andhrawatch
1 Min Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ ముగించేసిన పవన్, ‘ఓజి’ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని కూడా ముగించాలని ప్లాన్ చేస్తున్నాడు.

దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవనపుత్ర హనుమాన్ భక్తుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడని.. దీనికి ఉదాహరణగా ఆయన మెడలో హనుమాన్ లాకెట్ ఉన్న దండ కనిపించేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌లో త్వరలో షూటింగ్ మొదలు అని ప్రకటించేశారు.

మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ అయితే రావడం తో పవన్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Share This Article