సౌత్ ఇండియా మూవీస్ దగ్గర ఎంతో ఆదరణ ఉన్న స్టార్ హీరోస్ లో మంచిపేరు, ఫేమ్ ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే అటు తమిళ్ నుంచి బిగ్ స్టార్ అజిత్ కూడా ఓ హీరో. మరి ఈ ఇద్దరు పెద్ద స్టార్లు కూడా మన దేశపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
మరి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ వారి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఇపుడు అజిత్, బాలయ్య లకి పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అజిత్, బాలయ్యలు రెండు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవలు వారి వినూత్న అభిరుచిని తను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్స్ ని కొనియాడారు.వారు సినిమా రంగంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. దీంతో బాలయ్య, అజిత్ అభిమానులు పవన్ విషయంలో ఆనంద పడుతున్నారు.
