రెండోసారి తల్లైన పవన్‌ హీరోయిన్‌!

Friday, December 27, 2024

హీరోయిన్‌ ప్రణీత రెండోసారి తల్లి అయ్యారు. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు.  తాజాగా ప్రణీత తన భర్త, బిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, నెటిజన్స్ ఈ కన్నడ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. నటి ప్రణీతకు మొదటి సంతానంగా కూతురు ఉంది. కొడుకు పుట్టినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, కూతురు అర్నా ఆనందంతో డ్యాన్స్ చేసిందని ప్రణీత పేర్కొన్నారు.‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ప్రణీత సుభాష్ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు.

బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం.. వంటి సినిమాలు చేశారు. పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రణీత.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. 2010లో పోర్కీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీత.. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు.

2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, తన స్నేహితుడు నితిన్‌ రాజుని ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022 జూన్‌లో కూతురు అర్నా జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించారు. తెలుగు ఢీ డ్యాన్స్ షోలో కొన్ని ఎపిసోడ్‌లకి జడ్జీగా కూడా ఉన్నారు. రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి అయ్యారు. ప్రస్తుతం ఈ బాపుబొమ్మ బెంగళూరులో ఉంటున్న సంగతి తెలిసిందే

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles